Janavaradhi | Online News


సరికొత్త టైటిల్ తో చిరు


టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీనికి కూడా చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. మ్యాట్నీ మూవీస్ సంస్థ సహా నిర్మాతగా వ్యవహరించనుంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే చిత్ర రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.తన సినిమాల్లో ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉండేలా చూసుకుంటాడు డైరెక్టర్ కొరటాల శివ. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాల్లోనూ ఇదే తరహాను ఫాలో అయ్యాడు.

 

ఇప్పుడు చిరంజీవితో చేసే సినిమాలోనూ ఓ సందేశాన్ని ఇవ్వబోతున్నాడట. ఇందులో దేవాదాయ భూములకు సంబంధించిన అంశాలను చూపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.సరికొత్త టైటిల్ ఈ సినిమాలో చిరంజీవి డుయల్ రోల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ రెండు పాత్రల పేర్లు ‘గోవింద.. ఆచార్య' అని అందుకే ఈ సినిమా టైటిల్ అదే పెడుతున్నారని వార్తలు వచ్చాయి. ఈ పేరులోనే పోస్టర్ కూడా విడుదలైంది. అయితే, తాజాగా ఈ సినిమా టైటిల్ అది కాదని ఓ వార్త బయటకు వచ్చింది. ప్రస్తుత రిపోర్టులను బట్టి ఈ సినిమా అసలు టైటిల్ ‘గోవిందా హరి గోవింద' అని సమాచారం. ప్రస్తుతం ఉన్నది వర్కింగ్ టైటిలేనని అంటున్నారు.





POLL