Janavaradhi | Online News


ఇంగ్లీష్ మీడియం బోధన:రాజకీయాల్లో హాట్ టాపిక్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన సాగించాలని నిర్ణయించడంతో పాటు,తెలుగు మీడియం తీసివేయాలని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం పైన విమర్శలు గుప్పిస్తున్నాయి. మాతృభాషని మృతభాష గా మార్చవద్దని నిన్నటికి నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.ఇక ఇదే సమయంలో లోక్సభలో ఏపీలో తెలుగు మీడియం తీసివేత అంశంపై పెద్ద చర్చ జరిగింది. ఇక ఈ చర్చలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఇంగ్లీష్ మీడియం విద్యాబోధనకు వ్యతిరేకంగా ఉన్నాయని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు క్లారిటీ ఇచ్చారు. లోక్సభలో ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అన్న రఘురామకృష్ణంరాజు లోక్సభలో కేశినేని నాని తెలుగుభాష ప్రస్తావన తీసుకు వచ్చారని పేర్కొన్నారు.రఘురామ కృష్ణం రాజు ఏపీలో తెలుగు మీడియం లేకుండా చేస్తున్నారని లోక్సభలో మాట్లాడిన క్రమంలో, తెలుగు భాష పరిరక్షణ కోసం ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి మాత్రమే మాట్లాడానని రఘురామకృష్ణంరాజు స్పష్టంగా చెప్పారు.అంతేకాకుండా తాను తెలుగు అకాడమీకి రావాల్సిన నిధుల కోసమే మాట్లాడానని, అసలు ఇంగ్లీష్ అనే పదాన్ని ఎక్కడ కూడా వాడలేదని వివరించారు.





POLL