Janavaradhi | Online News


విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: న్యాయవాది బగ్గి


సత్తెనపల్లి, జనవారధి:సమాజంలో పౌరుడు చేసే ప్రతి పని చట్టంతో ముడిపడి ఉందని,విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచికోవాలని ప్రముఖ న్యాయవాది బగ్గి నరసింహారావు అన్నారు.
 
మంగళవారం  భవిష్య పాఠశాలలో జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.భారత రాజ్యాంగం దేశ పౌరులకు కల్పించిన హక్కులు, విధులను తెలుసుకుని ప్రవర్తించటం వల్ల సమాజంలో ఉత్తమ పౌరులుగా రూపొందుతారని వివరించారు.
 
భవిష్య పాఠశాల డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ..అంబెడ్కర్ వంటి మేధావుల కృషి వల్ల ఆధునిక భారత దేశానికి వెన్నుమూక లాంటి రాజ్యాంగం ఏర్పాటు జరిగిందని, అందరూ  రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
 
కార్యక్రమంలో ఉమాకళ్యాని, నరసింహాచార్యులు,అనిల్,శ్రీనివాసరావు,తదితరులు పాల్గొన్నారు.





POLL