Janavaradhi | Online News


అమరావతిలో చంద్రబాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తత


మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. బాబుకు స్వాగతం పలుకుతూ టీడీపీ కార్యకర్తలు, ఓ వర్గం రైతులు.. నిరసన తెలియజేస్తూ మరో వర్గం రైతులు పోటాపోటీగా మోహరించారు. చంద్రబాబు కాన్వాయ్ వెంకటాయపాలెం దగ్గరకు చేరుకోగానే.. ఓ వర్గం రైతులు రెచ్చిపోయారు. బాబు కాన్వాయ్‌పై చెప్పులు, కర్రలు విసిరారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.. ప్లకార్డులు ప్రదర్శించారు.చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు, కర్రలు విసరడంతో టీడీపీ కార్యకర్తలు కూడా రెచ్చిపోయారు. అవతలి వర్గంపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. తర్వాత బాబు కాన్వాయ్ అక్కడి నుంచి బయల్దేరి వెళ్లిపోయింది. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు పోలీసులుతో వాగ్వాదం తోపులాట జరిగింది.. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు.రెండు వర్గాలు భారీగా మోహరించడంతో అమరావతి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ముందస్తు జాగ్రత్తగా పోలీసుల్ని భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అడుగడుగా భద్రతను పెంచారు. చంద్రబాబు కాన్వాయ్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరూ నినాదాలు చేయొద్దని పోలీసులు హెచ్చరించారు.





POLL