Janavaradhi | Online News


19 ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం


తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో 19 ఏళ్ల అమ్మాయిని కొంతమంది సామూహిక అత్యాచారం చేసి .. అక్కడే చంపేసి వెళ్లిపోయారు. అతి దారుణంగా ..రేప్ చేసి ఆ తరువాత హత్య చేసి రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారు. స్థానికుల సమాచారం తో పోలీసులు రంగంలోకి దిగి అనుమానాస్పద మృతిగా భావించి కేసు నమోదు చేశారు.
 
పూర్తి వివరాలు చూస్తే ..   దీనదయాళ్నగర్లో ఈ అమ్మాయి తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. బుధవారం తన  పుట్టిన రోజు కావడంతో గుడికి వెళుతున్నానని అమ్మ కి  చెప్పి  ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన కూతురు ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమె  ఫోన్ కి కాల్ చేసారు. కానీ ఫోన్  స్విచ్ ఆఫ్ అని వచ్చింది. కంగారు పడిన కుటుంబ సభ్యులు బంధువులు చాలా చోట్ల వెతికారు. అయినప్పటికీ ఆ యువతి జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత రాత్రి 10 గంటల సమయంలో హంటర్రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్ సమీపంలో ఓ యువతి మృతదేహం ఉందని పోలీసులకి సమాచారం అందింది.
 
ఘటనా స్థలానికి కొద్ది దూరంలో బీరు సీసాలు అమ్మాయి చెప్పులు లభించాయి. దీనితో ఈ అమ్మాయిని ఎవరో  అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా మర్మాంగం నుంచి మాత్రం తీవ్ర రక్త స్రావం జరిగినట్లు గుర్తించారు. దీనితో ఆ యువతి పై  సామూహిక అత్యాచారం జరిగినట్లు భావిస్తున్నారు.పోలీసులు ఆ విధంగానే విచారణని ప్రారంభించారు.





POLL