డేటింగ్ యాప్‌లలో అబ్బాయిలను ఎంపిక చేస్తున్న కియారా!వెండితెరకు పరిచయమైన బాలీవుడ్ నటి కియారా అద్వానీ. ఈమె మహష్ బాబుతో "భరత్ అనే నేను", రామ్ చరణ్‌తో "వినయ విధేయ రామ" చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈమె న‌టించిన 'క‌బీర్ సింగ్' (తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్)తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలాగే, 'కాంచ‌న' రీమేక్ 'ల‌క్ష్మీబాంబ్'లో కూడా కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రాలు కాకుండా తాజాగా కియారా 'ఇందు కీ జ‌వానీ' అనే చిత్రంలో కూడా నటించనుంది.
 
ఈ చిత్రంలో ఆమె నటించే పాత్రపై అనేక మంది మండిపడుతున్నారు. ఈ చిత్రంలో కియారా డేటింగ్ యాప్‌లో అబ్బాయిల ప్రొఫైల్స్ చూసి ఎంపిక చేసుకుని డేటింగ్ చేయాల‌నుకునే పాత్ర‌లో క‌న‌పించ‌నుందట‌. దీని వ‌ల్ల ఆమెకు ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయ‌నేదే అస‌లు క‌థ‌ట. ఈ సినిమా గురించి కియ‌రా అద్వాని చెప్ప‌గానే కంగన ర‌నౌత్ సోద‌రి రంగోలి.. కియారా అద్వానిపై ఫైర్ అయ్యింది. మ‌హిళా సాధికార‌త గురించి మాట్లాడుతూ వారిని ఆట బొమ్మ‌లుగా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇలాంటి సినిమాలను సెన్సార్ అంగీక‌రిస్తే భావిత‌రాలు త‌ల‌దించుకునే రోజులు వ‌స్తాయంటూ రంగోలి కియారాపై ఘాటుగానే స్పందించారు.