నాకు వయసు తగ్గుతోంది : బాలయ్యసినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలృష్ణ 59వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో కేక్ కట్ చేశారు బాలకృష్ణ. అనంతరం మాట్లాడుతూ.. బసవతారకం హస్పిటల్లో సేవలు.. సినిమాల్లో నటన.. హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించడం పూర్వజన్మసుకృతమన్నారు బాలయ్య. తనకు అందరూ విష్‌ చేస్తున్నారని 'అందరికీ వయసు పెరుగుతందని, కానీ తనకు తగ్గుతోందని చెప్పా' అని అన్నారు. తనను ఆరకంగా విష్‌ చేయండని కోరారు. ఇక సినిమాల విషయానికొస్తే బాలయ్య తన 105వ సినిమాను కెఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో చేయనున్నారు.