నేటి నుంచి ఇసుక రవాణా బంద్‌..!ఇసుక తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఏపీలో తక్షణం ఇసుక తవ్వకాలు నిలిపివేస్తూ నిర‌్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి 15 రోజుల్లో కొత్త పాలసీ తీసుకొస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో వేల కోట్ల ఇసుక దోపిడీ జరిగిందని చెప్పారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు.