టీమిండియాకు క్రీడాస్ఫూర్తి లేదు...పాక్ మాజీ బౌలర్!ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ ఓట‌మిని పాకిస్థాన్‌ అభిమానులు, ఆ దేశ మాజీ ఆట‌గాళ్లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. భార‌త్ ఓట‌మితో ఇంగ్లండ్‌కు సెమీస్‌ అవకాశాలు అవ‌కాశాలు మెరుగుప‌డి పాక్‌కు క‌ష్ట‌మైన నేపథ్యంలో పాక్ అభిమానులు, ఆట‌గాళ్లు సోష‌ల్ మీడియా ద్వారా కోహ్లీ సేన‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తాజాగా ప్ర‌ఖ్యాత బౌల‌ర్‌, పాక్ మాజీ ఆట‌గాడు వ‌కార్ యూనిస్ కూడా టీమిండియాను ప‌రోక్షంగా విమ‌ర్శించాడు. టీమిండియాకు క్రీడాస్ఫూర్తి లేద‌ని ఆరోపించాడు.
 
`నువ్వు ఎవరనేది ముఖ్యం కాదు. జీవితంలో ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నావ‌నే దాని బట్టి నువ్వు ఎవరు అనేది తెలుస్తుంది. పాకిస్థాన్‌ సెమీస్‌కు వెళ్తుందా? వెళ్లదా? అనేది నేను ప‌ట్టించుకోను. కానీ ఒక్క విష‌యం మాత్రం స్ప‌ష్టంగా చెప్ప‌గ‌ల‌ను. కొందరు ఛాంపియన్లు క్రీడాస్ఫూర్తి విష‌యంలో ఘోరంగా విఫలమ‌య్యార‌`ని ట్వీట్ చేశాడు. పాక్‌ను టోర్నీ నుంచి బయటకు పంపించేందుకు టీమిండియా కావాలనే ఓడిపోయిందని పాక్ మాజీ ఆట‌గాళ్లు కొంద‌రు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.