రొమాంటిక్‌గా ఉండేవాడు నాకు భర్తగా కావాలి:రష్మికరష్మిక మందానా.. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఆమె తనకు కాబోయే భర్త రొమాంటిక్ గా ఉండాలని కోరుకున్తున్నట్టు చెప్పింది. విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న డియర్ కామ్రేడ్ సినిమాలో ఆమె హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా ఈనెల 26న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రచారకార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విధంగా చెప్పారు. ఆమెకు కాబోయే భర్త ఎలా ఉండాలని అనుకుంటున్నారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ 'అతడు తన భావాల్ని, ఇష్టాల్ని వ్యక్తపరిచే వ్యక్తైనా, కాకపోయినా ఫర్వాలేదు. కానీ నిజాయతీగా ఉండాలి. అతడి ప్రవర్తన నాకు నచ్చాలి. అన్నింటికన్నా మించి అతడిది మంచి మనస్సై ఉండాలి. అతడితో చాలా సమయం గడపాలని నాకు అనిపించాలి. నా దృష్టిలో రొమాంటిక్‌గా ఉండేందుకు వయసుతో పనిలేదు' అంటూ చెప్పుకొచ్చింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. అయితే, ఇప్పటికే రష్మిక తన సహనటుడు రక్షిత్ శెట్టి తో నిశ్చితార్థం చేసుకుంది. కానీ, కొన్ని కారణాలతో వారిద్దరూ ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.