బిగ్ బాస్ లోకి రకుల్....!ఎన్నో వివాదాల మధ్య బిగ్ బాస్ తన థర్డ్ సీజన్ ని మొదలు పెట్టింది . అందులో భాగంగానే తన మొదటివారాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది . ఈ సీజన్ కి బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నాడు . అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ లోకి నాగార్జున రకుల్ ని తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ లోకి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రావడం అనేది మనకు తెలిసిన విషయమే . అయితే నాగార్జున మరియు రకుల్ కలిసి నటిస్తున్న మన్మధుడు 2 సినిమా వచ్చే నెల ఆగస్టు 9 న విడుదల కానుంది . ఈ నేపధ్యంలో రకుల్ మరియు చిత్ర యూనిట్ కలిసి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు . గతంలో ఈ షోకి హోస్ట్ గా వ్యహరించిన ఎన్టీఆర్ జై లవ కుశ సినిమాకి గాను ప్రమోషన్ చేసుకున్నారు . ఇక నాని దేవదాస్ సినిమాని ప్రమోషన్ చేసుకున్నాడు . తాజాగా నాగ్ తన తాజా సినిమా మన్మధుడు 2 ప్రమోషన్ చేసుకోనున్నారు .