మరోసారి పాండ్యా లవర్ అన్నారో.. చెప్పిచ్చుకుని కొడతా....బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా మండిపడ్డారు. తనను భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రియురాలు అంటూ కామెంట్స్ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఆగ్రహించారు. పైగా, ఇకపై తనను క్రికెటర్ పాండ్యా లవర్ అంటే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చించారు. పైగా తన గురించి రాసే వార్తలను పిచ్చివార్తలుగా ఆమె కొట్టిపారేశారు. గతంలో చానాళ్ల పాటు క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో కలిసి చెట్టపట్టాలేసుకుని ఈ అమ్మడు తిరిగింది. వీరిద్దరూ ఎన్నో పార్టీలకు జంటగా వెళ్లారు. దాంతో వారిద్దరూ డేటింగ్‌ లో ఉన్నారని, పెళ్లికి సిద్ధమవుతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం పాండ్యాకు దూరంగా ఉంటుంది.
 
తాజాగా, ఆమె ఓ విషయంలో పాండ్యా సాయం కోరినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఇదే విషయమై, ఓ హిందీ వార్తా పత్రిక వార్తను అందిస్తూ, హార్దిక్‌ పాండ్యా మాజీ ప్రేయశి ఊర్వశి అంటూ... కథనాన్ని ప్రచురించింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం తెలుసుకున్న ఊర్వశి అగ్గిమీద గుగ్గిలమైంది. ఇవన్నీ పిచ్చి వార్తలని మండిపడింది. మీడియా ఇలాంటి వార్తలను ప్రచురించొద్దని కోరింది. మీ వార్తలతో కుటుంబ కలహాలు వస్తున్నాయని, భవిష్యత్తులో ఏదన్నా జరిగితే తన కుటుంబానికి జవాబు చెప్పుకోలేనని వాపోయింది.