రకుల్ ని మరోసారి టార్గెట్ చేసిన శ్రీరెడ్డి ...సంచలనాలకు మారుపేరు శ్రీరెడ్డి .. అప్పుడెప్పుడో క్యాస్టింగ్ కౌచ్ తో టాలీవుడ్ లోని ఓ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి సినీ పెద్దలని టార్గెట్ చేస్తూ నానా హంగామా చేసింది . అయితే తన ఉద్యమం పక్క దారి పట్టడంతో ప్రస్తుతం హైదరాబాదు నుండి తన మకాంని చెన్నై కి మార్చేసింది . అయిన తన ఉద్యమం ఆపలేదు . రోజుకో సెలబ్రేటీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తూ వస్తుంది . తాజాగా హీరోయిన్ రకుల్ ని టార్గెట్ చేసింది శ్రీరెడ్డి . ''రకుల్ పీతి ఐరన్ లెగ్.. పాపం మా బాబాయ్ సినిమా హీరోయిన్ అన్నప్పుడే డిసైడ్ అయ్యా.. ఇది డిసాస్టర్ అని.. అనసూయ ఐతే సూపర్ హిట్ అయ్యేది'' అంటూ ఫేస్ బుక్ వేదికగా పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. అయితే దీనిపైన నెటిజన్లు స్పందిస్తూ నువ్వే అయితే బాగుండు సినిమా హిట్టు అయ్యుండేదని కామెంట్స్ పెడుతున్నారు .