సత్తెనపల్లిలో పోలీసుల నిఘా వైఫల్యం



పట్టణంలో నిఘాలేక దొంగతనాల జోరు
స్పందించని పోలీస్ అధికారులు 
తీవ్ర ఆందోళనలో ప్రజలు 
డిస్పీకి ఫిర్యాదు చేయనున్న స్ధానికులు 
 
సత్తెనపల్లి,జనవారధి:ఆర్తులకు, బాధాతప్త హృదయులకు పోలీసు స్టేషనే చక్కని ఆశ్రయం.ఖాకీ దుస్తులలో ఉన్న పోలీసే సామాన్యుడికి భగవంతుని అవతారం.అలాంటి స్ధానంలో ఉన్న పోలీసులు సామాన్యుల విషయంలో,బాధితులకు న్యాయం జరిగే విషయంలో,ప్రజలకు సమాధానం చెప్పే విషయంలో అలసత్వం,నిర్లక్ష్యం వహిస్తే బాధితులు ఎవరికీ చెప్పుకోవాలి. శాంతి భధ్రతలను, నేరాలను అదుపు చేయడానికి ఎస్పీ  ఓ పక్క బందోబస్తును పకడ్బందీగా నిర్వహిస్తున్న తరుణంలో మరో పక్క క్రింద స్ధాయి సిబ్బంది నిర్లక్ష్యం,నిఘా వైఫల్యం కారణంగా పోలీస్ శాఖ పలు విమర్శలను ఎదుర్కొంటుంది.
 
పట్టణంలో పోలీస్ సిబ్బంది నిఘా వైఫల్యం 
 
పట్టణంలో పోలీసుల నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.వరుస దొంగతనాలతో పట్టణవాసులు వణికిపోతున్నారు.తాళం వేసిన ఇళ్లల్లోనే కాదు మనుషులు ఉన్న ఇళ్లల్లో కూడా దొంగతనాలకు పాల్పడుతుండటంతో బెంబేలెత్తిపోతున్నారు.పోలీసులు పహారా కాస్తున్నా,దొంగతనాలు అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నా..యథేచ్ఛగా జరుగుతుండటంపై తీవ్ర స్ధాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి.
 
ఒకే ప్రాంతాల్లో వరుసగా..
 
పట్టణంలోని ఆదరణ వృద్ధాశ్రమం ప్రాంతంలో సామ్రాజ్యం అనే వృద్ధురాలి ఇంట్లో నాలుగు రోజుల క్రితం రూ.30 వేల నగదును అపహరించారు.వల్లెం చెన్నకేశవరావు నివాసంలో తలుపుకు తగిలించిన చొక్కా జేబులో నుండి రూ.670 నగదును దొంగిలించుకుని పోయారు.ఇదే ప్రాంతంలో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నివాసంలో ఎలక్ర్టికల్ సామాగ్రిని దోచుకున్నారు.ఇలా పట్టణంలో వరుసగా జరుగుతున్న చిల్లర దొంగతనాలు పోలీసులు తలనొప్పిగా మారితే.. ప్రజలను ఆందోళనలో నెట్టేస్తున్నాయి.
 
పోలీసులకు సమాచారమిచ్చినా..
మా ఇంట్లో దొంగలు పడ్డారు.నగదును దోచుకెళ్లారు.మా ప్రాంతంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలతో ఆందోళనలో ఉన్నాం.ఇంట్లో మహిళలను ఒంటిరిగా వదిలి వెళ్లాలంటే భయమేస్తుంది.దొంగలతో పటు కొందరు ఆకతాయిలు ఇక్కడ మద్యం,గంజాయి సేవిస్తూ కలకలం సృష్టిస్తున్నారు.పోలీసులకు సమాచారమిచ్చిన్నా వారు వెంటనే స్పందించలేదు.దీనిపై స్ధానికులతో కలసి  డిస్పీకి ఫిర్యాదు చేస్తున్నాం. - వల్లెం చెన్నకేశవరావు, బాధితుడు.
 
పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం. సంపన్నుడు మొదలు సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ ప్రతి అవసరానికీ సాయం కోరేది పోలీసులనే.బాధితుల సమస్యలను ఆలకించి,వారికీ న్యాయం జరిగేలా..చిత్తశుద్ధితో పోలీస్ వారు పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు.