డ్రైనేజీల నిర్మాణం లేక వర్షపు నీటితో ఇక్కట్లు



సత్తెనపల్లి,జనవారధి:వర్షాలు కురుస్తుండటంతో పట్టణంలోని 28వ వార్డ్ ప్రజలు ప్రజలు వణికిపోతున్నారు.డ్రైనేజీల  నిర్మాణం చేపట్టకపోవడం మురుగునీరు పారుదల కాక రోజుల తరబడి నీరు  నిలిచిపోతోంది.గతంలో అధికారులకు విన్నవించినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం శోచనీయమన్నారు.వాతావరణ మార్పులతో వ్యాధులు ప్రబలుతాయనే భయంతో  జీవిస్తున్నామని వివరిస్తున్నారు.అధికార పార్టీ నాయకులూ,స్ధానిక ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి సైడ్ కాల్వల నిర్మాణం చేపట్టాలని,దోమలు వ్యాప్తి చెందకుండా ఫాగింగ్ చేయాలనీ కోరుతున్నారు. దోమలపై దండయాత్రంటూ ర్యాలీలు, ప్రదర్శనలకు పరిమితం కాకుండా పారిశుద్ధ్యం విషయంలో ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.