అమితాబ్ లుక్ కు అద్భుత స్పందనగులాబో సితాబో అనే  కామెడీ సినిమాలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. షూజీత్ సర్కార్ దర్శకత్వం వహిస్తున్నారు. గులాబో సితాబో చిత్రం 28 ఫిబ్రవరి 2020 రిలీజవుతుందని ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ కొత్త తేదీని వెల్లడించారు. దీంతో పాటు అమితాబ్-ఆయుష్మాన్ స్టిల్ ని రిలీజ్ చేశారు. దీనికి అద్భుత స్పందన వస్తోంది. తెల్ల పైజామాపై పచ్చ రంగు కుర్తాతో కనిపించిన అమితాబ్ ఒక వృద్ధుడిగా కనిపిస్తున్నాడు. అసలు ఆయన అమితాబ్ యేనా? అన్న సందేహం కలిగేంతగా గుర్తు పట్టలేనంతగా ఉంది ఆ రూపం. మాసిన దుస్తులతో మామూలు సాధాసీదా ముసలాయనలా ఆ గెటప్ ఆశ్చర్యపరుస్తోంది. అమితాబ్ లుక్ ఇదివరకూ రివీలైనప్పుడు అద్భుత స్పందన వచ్చింది. ఈసారి మాత్రం అమితాబ్ తో ఆయుష్మాన్ కలిసి ఉన్న స్టిల్ ఆసక్తిని పెంచింది.